Monday, May 6, 2024

మిసా భారతికి బెయిల్‌ మంజూరు

spot_img

పాటలీపుత్ర ఆర్జేడీ లోక్‌సభ అభ్యర్థి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మిసా భారతికి దానాపూర్‌ సివిల్‌ కోర్టు ఊరట కలిగించింది. ఇవాళ(శనివారం) ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారణ తర్వాత ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా మానేర్‌ పోలీస్‌స్టేషన్‌లో మిసా భారతిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో మిసా భారతిని హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రూ.10వేల బాండ్‌పై మిసా భారతికి బెయిల్ మంజూరు చేసింది. ఆమెను కోర్టు నుంచి బయటకు తీసుకెళ్తుండగా జర్నలిస్టులు ఆమెను మాట్లాడాలని కోరగా.. కారులో కూర్చొని వెళ్లిపోయారు.

రైల్వేలో ఉద్యోగాలకు భూమికేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన తొలి చార్జిషీట్‌లో మిసా భారతి పేరు ఉన్నది. లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతి ఆర్జేడీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పాటలీపుత్ర నుంచి ఆమె ఇప్పటికే రెండుసార్లు పోటీచేసి బీజేపీ అభ్యర్థి రాంకృపాల్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. లాలూ ప్రసాద్ కూడా ఆమెను రెండుసార్లు రాజ్యసభకు పంపారు.

ఇది కూడా చదవండి: పరిపాలన చేతకాక రేవంత్ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడు

Latest News

More Articles