Wednesday, May 1, 2024

ఫీల్డింగ్ చేస్తూ శ్రీవల్లి పాటకు స్టెప్పులు వేసిన డేవిడ్ వార్నర్…వీడియో వైరల్..!!

spot_img

పుష్పలోని శ్రీవల్లిపాటకు అంతర్జాతీయంగా అభిమానులున్నారు. పుష్ప సినిమా ఎంతగా ప్రభావం చూపించిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. చాలా మంది ఈ సినిమాలోని తగ్గేదెలే అనే మ్యానరిజాన్ని శ్రీవల్లిపాటను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఏం చేసినా ఫాలో అయ్యే సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఆయన అల్లు అర్జున్ ను బాగా ఫాలో అవుతున్నాడు.

డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తరచుగా వారు రీల్స్‌ను చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. సెలబ్రిటీలు చాలా ఇష్టపడే వారికి ఇష్టమైన సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తారు. పుష్ప చిత్రం విడుదలైనప్పుడు, డేవిడ్ వార్నర్ తన కుమార్తెతో కలిసి పుష్ప పాటలు, డైలాగ్‌లపై చాలాసార్లు రీల్స్‌ చేశాడు. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియోలను షేర్ చేశాడు.

ప్రపంచకప్ సందర్భంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో, డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ కోసం బౌండరీలో ఉన్నాడు. పుష్ప చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాట స్టేడియంలో ప్లే కాగానే, డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టెప్‌ని ఫాలో అయ్యాడు. ఇది చూసిన వెంటనే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫీల్డింగ్ చేస్తూ శ్రీవల్లి పాటకు డేవిడ్ వార్నర్ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం..!!

Latest News

More Articles