Sunday, April 28, 2024

కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలు ఫెయిల్‌‌.. కేసీఆర్ పాలన బెస్ట్

spot_img

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్‌) పార్టీ అగ్రనేత కుమారస్వామి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పాలనపై కుమారస్వామి ప్రశంసలు కురిపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీలు ఫెయిల్ అయ్యాయన్నారు. ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ఓట్ల కోసం ఈ ఐదు గ్యారంటీల ముచ్చట చెబుతోందని కుమారస్వామి ఎద్దేవా చేశారు.  ఈ ఐదు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలతో పేదలకు ఒరిగేదేం లేదన్నారు.

Also Read.. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. బాల్క సుమన్ ఫైర్

కర్ణాటకలో రెండు గంటలే కరెంటు ఇస్తూ తెలంగాణలో 5 గంటలని అబద్ధాలు చెబుతున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కర్ణాటకలో అమలు కాలేదన్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతుంబంధు కింద ఇప్పటివరకు రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తెలుసని, కాంగ్రెస్‌ దగాకోరు వైఖరిని, నయవంచనను అందరూ గుర్తించాలని ఆయన కోరారు.

Latest News

More Articles