Tuesday, May 7, 2024

అంగన్వాడీ టీచర్లకు శుభవార్త..వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్..!!

spot_img

అంగన్వాడీ టీచర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ప్రకటించనున్న పీఆర్సీలో వారిని చేర్చాలని సీఎం నిర్ణయించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ను హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సమ్మెపై ఏఐటీయూసీ, సీఐటీయు నాయకులతో మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చర్చలు జరిపారు. అంగన్వాడీ టీచర్ల డిమాండ్లను విని సానుకూలంగా స్పందించారు మంత్రులు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలోనే ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో వారిని కూడా చేర్చుతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అంగన్వాడీ టీచర్ల జీతాలు కూడా పెంచుతామని హమీ ఇచ్చారు. ఇతర డిమాండ్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ తోపాటు ఈ స్కీమ్స్‎లో చేరినవారికి బ్యాడ్‎న్యూస్..!

సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 70వేల మంది అంగన్ వాడీ ఉద్యోగులకు లాభం చేకూరుతుందని మంత్రి హారీశ్ అన్నారు. వారి సమస్యలను పరిష్కారిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని.. అంగన్ వాడీ వర్కర్లు గా ఉన్నవారి పేరును అంగన్ వాడీ టీచర్లుగా గౌరవప్రదంగా ఉండేలా సీఎం కేసీఆర్ మార్చారని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై అంగన్వాడీ టీచర్లు, సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

 

Latest News

More Articles