Saturday, April 27, 2024

సైలెంట్‎గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన గుడ్‎నైట్ హీరోయిన్.!

spot_img

తమిళ యంగ్ బ్యూటీ మీతా రఘునాథ్ మూడుముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం మీతా తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో మీతా వివాహం ఘనంగా జరిగింది. మీతా తన ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. అందరూ మీతాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ముత్తుల నీ నిథూమ్ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మీతా. తొలి సినిమాతోనే యువత మనసును దోచేసింది. తన యాక్టింగ్ తో యువతను మెస్మరైజ్ చేసింది. గతేడాది వచ్చిన గుడ్ నైట్ సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమాలో అను పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు. వరుస సినిమాలతో బిజీగా మారుతుందనుకున్న సమయంలో గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది. ఇక ఆదివారం వివాహం చేసుకుందీ ఈ బ్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by Meetha Raghunath (@the.meethling)

ఇది కూడా చదవండి: ఉదయం నిద్ర లేవగానే గొంతనొప్పిగా ఉందా?ఈ రెమెడీస్ ట్రై చేయండి.!

Latest News

More Articles