Tuesday, May 7, 2024

లక్షకు పైగా జీతంతో ప్రభుత్వం ఉద్యోగం..ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి.!

spot_img

గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం పెట్టుకున్నారా. ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నారా. అయితే మీకోసమే ఈ శుభవార్త. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెస్ కార్పొరేషన్ లో భారీగా ఉద్యోగాలు ఉన్నాయి. రిక్రూట్ మెంట్ డ్రైవ్ 2024 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫుల్ టైం స్పెషలిస్టు, పార్ట్ టైమ్ స్పెషలిస్టు, పోస్టుల కోసం ఖాళీలను ప్రకటిస్తూ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ విధానంలో ఏప్రిల్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా సంస్థ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ లేదా తత్సమాన డిగ్రీతో ఎంబీబీఎస్ డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా ఏదైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ తప్పనిసరి. పీజీ డిగ్రీ ఉన్న ఏ అభ్యర్థి అయినా వారి సంబంధిత రంగంలో కనీసం మూడేండ్ల అనుభవం కలిగి ఉండాలి. అదే విధంగా పీజీ డిప్లొమా డిగ్రీలు ఉన్న అభ్యర్థులు వారి సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం ఐదేండ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ESICరిక్రూట్ మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 69 ఏండ్ల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం కూడా ఉంటుంది. ఫుల్ టైమ్ స్పెషలిస్టు జీతం నెలకు రూ. 1,06,000పార్ట్ టైమ్ స్పెషలిస్టు జీతం రూ. 60,000పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.esic.gov.inను ఓ సారి చెక్ చేసుకోండి.

ఇది కూడా చదవండి : భార్య డబ్బులు వాడుకునే హక్కు భర్తకు లేదు..సుప్రీంకోర్టు.!

Latest News

More Articles