Sunday, May 5, 2024

నైతిక విలువలు ఉంటే కడియం ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలి

spot_img

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన క‌డియం శ్రీహ‌రి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌డియం శ్రీహ‌రికి గ‌ట్టిగా గుణ‌పాఠం చెప్పాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.

క‌డియం శ్రీహ‌రి బీఆర్ఎస్‌ను వీడిన త‌ర్వాత కార్య‌క‌ర్త‌ల్లో జోష్ ఎక్కువ‌గా క‌న‌బ‌డుతోంది. క‌సి ఎక్కువ‌గా క‌న‌బ‌డుతోంది. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఉప ఎన్నిక‌లో ప‌ని చేసిన ఉత్సాహం ఇవాళ మీలో క‌న‌బ‌డుతోంది. పార్టీకి ద్రోహం చేసిన క‌డియం శ్రీహ‌రికి గ‌ట్టిగా గుణ‌పాఠం చెప్పాల‌నే క‌సి కార్య‌క‌ర్త‌ల్లో క‌న‌బ‌డుతుంది. ఆయ‌న బిడ్డ‌కు ఎంపీ టికెట్ తీసుకుని, అంద‌రితో స‌మావేశాలు పెట్టించి చివ‌రి క్ష‌ణంలో పార్టీ మారారు. ఇలాంటి ద్రోహుల‌కు గుణ‌పాఠం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు హ‌రీశ్‌రావు.

పార్టీ మార‌డ‌మంటే కార్య‌క‌ర్త‌ల మ‌నోస్థైరాన్ని దెబ్బ‌తీయ‌డం, పార్టీని అవ‌మాన‌ప‌ర‌చ‌డ‌మేన‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో శ్రీహ‌రికి ఏం త‌క్కువ చేయ‌లేదు. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవ‌కాశాలు ఇచ్చింది పార్టీ. ఆయ‌న జీవితాంతం రుణ‌ప‌డి ఉన్న కూడా పార్టీకి త‌క్కువే. పార్టీ మారేది లేదు.. బీఆర్ఎస్‌లోనే ఉంటాన‌ని ప‌లు వేదిక‌ల‌పై చెప్పారు. అవ‌స‌ర‌మైతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను కానీ పార్టీ మార‌న‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. నీతి, నిజాయితీ, విలువ‌లు ఉంటే.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ప‌లు సంద‌ర్భాల్లో క‌డియం శ్రీహ‌రి రేవంత్ రెడ్డిని దొంగ‌తో పోల్చారు. సెక్ర‌టేరియ‌ట్‌లో లంకె బిందెలు ఉన్నాయ‌న‌కున్న రేవంత్ మాట‌ల‌కు క‌డియం కౌంట‌ర్ ఇచ్చారు. రేవంత్ ఓ దొంగ అని తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన క‌డియం.. ఇవాళ అదే దొంగ‌తో కాంగ్రెస్ కండువా క‌ప్పించుకున్నాడు. ఈ వ‌య‌సులో ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా..? అని ప్రశ్నించారు హ‌రీశ్‌రావు.

కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మం ప్రారంభించిన నాడు ప‌ట్టుమ‌ని ప‌ది మంది లేరు. జ‌య‌శంక‌ర్ సార్ దీవెన‌తో ఉద్య‌మాన్ని ప్రారంభించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. కేసీఆర్ నాయ‌క‌త్వంలో బీఆర్ఎస్ త‌ప్ప‌కుండా అధికారంలోకి వ‌స్తుంది. చ‌రిత్ర చూస్తే కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్ ఏ రాష్ట్రంలో కూడా ఐదేండ్లు కంటే ఎక్కువ లేదు. ఛ‌త్తీస్‌గ‌ఢ్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో ఐదేండ్లు మాత్ర‌మే ఉంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌న్నారు హ‌రీశ్‌రావు.

ఇది కూడా చదవండి: కడియం శ్రీహరి ఓటమే లక్ష్యంగా పని చేస్తా

Latest News

More Articles