Sunday, April 28, 2024

హైదరాబాద్‌ ముందు బెంగళూరు బలాదూర్!

spot_img

హైదరాబాద్: ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్‌ తీసుకున్న చొరవతో దేశ, విదేశాలకు చెందిన ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు గత పదేండ్ల కాలంలో వేల కోట్ల పెట్టుబడులతో నగరానికి క్యూ కడుతున్నాయి. ఐటీ రంగంలో సిలికాన్‌ వ్యాలీగా పేరున్న బెంగళూరుతో పోటీలో హైదరాబాద్‌ దూసుకుపోతుంది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌… ఇలా ఐటీ రంగంలోని కంపెనీలే కాకుండా బయోటెక్నా లజీ, ఫార్మా, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఆర్‌అండ్‌డీ రంగాల్లో టాప్ కంపెనీల్లో ఉన్న కంపెనీలు హైదరాబాద్‌ నుంచి కార్యాకలాపాలను నిర్వహిస్తున్నాయి.

Also Read.. కొడంగల్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్

మొన్నటి వరకు ఐటీ, బీటీ రంగా లకు క్యాపిటల్‌ సిటీగా పేరు తెచ్చుకున్న గార్డెన్‌ సిటీ… ప్రతిష్ట క్రమంగా మసకబా రుతున్నది. ‘కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా బెంగళూరులోని స్టార్టప్‌ కంపెనీలకు తిప్పలు తప్పడం లేదు’ అని ఖాతా బుక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రవీశ్‌ నరేశ్‌ ట్వీట్‌ చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. గతుకుల రోడ్లు, పవర్‌ కట్స్‌, అస్తవ్యస్తమైన నీటి సరఫరాతో అక్కడి కంపెనీలు క్రమంగా తరలిపోతున్నాయి.

Also Read.. వీడియో: నిప్పులు కురిపించిన ఆర్మీ హెలికాప్టర్‌ రుద్ర

అయితే, తెలంగాణ సర్కార్‌ మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ శాంతిభద్రత లకు అధిక ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన వ్యవస్థ లను తీర్చిదిద్దింది. 50 ఏండ్ల అవస రాలే లక్ష్యంగా వాటిని సమకూర్చారు సీఎం కేసీఆర్. దీంతో హైదరాబాద్‌ గొప్పతనాన్ని చారిత్రాత్మకంగా, ఐటీపరంగా, అభివృద్ధి పరంగా వివరిస్తూ, ఐటీ కారిడార్‌లో ఆకాశ హర్యాలను, విశాలమైన రోడ్లను పొడుగుతూ సినీ స్టార్లు, ప్రముఖులు సోషల్ మీడియలో చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో మెరుగైన మౌలిక వసతులు, అందుబాటులో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నివాసయోగ్యంగా ఉండడం, అత్యంత అనుకూలమైన ప్రభుత్వ విధానాలు ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌లో బెంగళూరును మించి వృద్ధి రేటును సాధిస్తున్నది. రెసిడెన్షియల్‌ విభాగంలోనూ 48 శాతం వృద్ధిని కనబర్చిందని రియల్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్‌ సమస్యను క్లియర్ చేసేందుకు గత 9 ఏండ్లలోనే 35 వరకు ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు, 135కు పైగా లింకు రోడ్లను నిర్మించారు. మరికొన్ని లింకురోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌ కేంద్రంగా సుమారు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తుండగా, వారంతా సాఫీగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రజా రవాణా వ్యవస్థలతోపాటు విశాలమైన కొత్త లింకు రోడ్లు అందుబాటులోకి వచ్చాయి.

Latest News

More Articles