Thursday, May 9, 2024

వరుసగా ఆరోసారి.. దేశంలోనే బెస్ట్‌ సిటీగా హైదరాబాద్‌.. కేటీఆర్ హర్షం

spot_img

హైదరాబాద్:  హైదరాబాద్‌ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో హైదరాబాద్‌ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాను క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ రిపోర్ట్‌ 2023 పేరిట మెర్సర్స్‌ కంపెనీ విడుదల చేసింది. ఇందులో వియన్నా ( ఆస్ట్రియా) తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో జురిచ్‌ (స్విట్జర్లాండ్‌), మూడో స్థానంలో ఆక్లాండ్‌ (న్యూజిలాండ్‌) నిలిచాయి.

భారత్‌ విషయానికొస్తే.. ఈ జాబితాలో హైదరాబాద్‌ ( 153వ స్థానం) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పుణె 154, బెంగళూరు 156, చెన్నై 161, ముంబై 164, కోల్‌కతా 170, న్యూఢిల్లీ 172వ స్థానంలో నిలిచాయి. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో ఖార్టౌమ్‌(సూడాన్‌) 241వ ర్యాంక్‌తో అట్టడుగున నిలిచింది. ఆ తర్వాత ఇరాక్‌లోని బాగ్దాద్‌ 240వ ర్యాంకులో ఉంది.

కేటీఆర్ హర్షం

మెర్సర్‌ జాబితా ప్రకారం హైదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ 2015 నుంచి వరుసగా ఆరోసారి ఈ ఘనత సాధించిందని, ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

More Articles