Saturday, April 27, 2024

ఐదురోజులు వర్ష సూచన.. జర జాగ్రత్త..!!

spot_img

తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also Read..‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ఫుల్ కామెడీ.. ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేశా

ఇక సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Latest News

More Articles