Sunday, May 5, 2024

పాత కొత్త పంచాయితీ.. పాతాళంలోకి కాషాయం ?

spot_img

తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అచ్చం కాంగ్రెస్ మాదిరి కమల పార్టీలో సైతం ఆధిపత్య పోరు నడుస్తుంది. బండి సంజయ్ తో సీనియర్లతో పెద్దగా పొసగడం లేదనే సంగతి తెలిసిందే. తాజాగా బి‌జే‌పి భావజాలంకు కాస్త దూరంగా ఉండే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారు..ఎంట్రీతో సీన్ మారింది. అక్కడ నుంచి పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ నడుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈటల, బండి మధ్య పోరు తారస్థాయిలో ఉందని తెలుస్తోంది.

ఇటీవల ఈటల తన టీంతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావులతో కలిసి వారిని బి‌జే‌పిలోకి ఆహ్వానించారు. కానీ ఆ విషయం తనకు తెలియదని బండి చెప్పుకొచ్చారు. పైగా ఇటీవల సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తామని, రికమండేషన్, లాబీయింగ్‌లు పనిచేయవని..పరోక్షంగా ఈటల వర్గానికి షాక్ ఇచ్చేలా ప్రకటన ఇచ్చారు బండి.

దీనికి ఈటల తాజాగా కౌంటర్ ఇచ్చారు. బి‌జే‌పి అధ్యక్షుడుగా బండి కొనసాగుతారని.. తనని ఎలా వాడుకోవాలో అధిష్టానం ఆలోచిస్తుందని చెప్తూనే.. పార్టీలో ఉన్న పాత వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి ఘర్షణ వాతావరణం ఉండడం సహజమని చెప్పుకొచ్చారు. పాత, కొత్త అని బేదం ఉండకూడదని అధిష్టానమే చెబుతోందని, ప్రజా క్షేత్రంలో పేరున్న వారికే టికెట్లు వస్తాయని అన్నారు. దీని బట్టి చూస్తే పార్టీలో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ మాత్రం నడుస్తుందని చెప్పవచ్చు.

 

Latest News

More Articles