Friday, May 10, 2024

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం

spot_img

రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ఇవాళ(బుధవారం)ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాధాకృష్ణన్‌కు కేంద్రం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.దీంతో ఇవాళ ఉదయం 11.15 గంటలకు రాజభవన్ లో తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణతోపాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా రాధాకృష్ణన్‌ అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న తమిళిసై రాజీనామా చేయడంతో ఆ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకుని తమిళిసై గవర్నర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవులను వదులుకున్నారు. దాంతో జార్ఖండ్‌ గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇది కూడా చదవండి:లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌: నేటి నుంచి నామినేషన్‌లు

Latest News

More Articles