Thursday, May 9, 2024

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

spot_img

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.  క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు సుదీర్ఘంగా సాగడంతో ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Also Read.. నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌

ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీకోర్టు ధర్మాసనం విచారణను శుక్రవారానికి (అక్టోబర్ 20) కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వే, సీఐడీ తరుపున ముకుల్‌ రోహత్గీ సుధీర్ఘ వాదనలు వినిపించారు. అంత వరకు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

Latest News

More Articles