Saturday, May 4, 2024

దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్.. బిగ్ బాస్ సన్నీ CCTV ఫుటేజ్ వైరల్..!

spot_img

బిగ్ బాస్ సీజన్ 5 విజేత వీజే సన్నీ బ్యాగ్ నిండా నగదుతో పారిపోతుండగా.. సీసీటీవీలో రికార్డ్ అయిన ఒక వీడియో లీక్ అయింది. కారులో వచ్చిన సన్నీ ఒక అపార్టుమెంటులోకి వెళ్లి.. ఆపై డబ్బుల కట్టలున్న బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి తన కార్ లో పారిపోయినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. CCTV ఫుటేజ్ లో జనవరి 2న ఈ వీడియో తీసినట్టు ఉండగా.. లొకేషన్ ఎక్కడో తెలియటం లేదు. సన్నీ భవనం నుండి బయటకు పరుగెత్తటం.. అతని SUV లో నగదుతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. సన్నీ తన వాహనంలో బ్యాగ్‌ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతను అనుకోకుండా జారిపడతాడు. దాంతో బ్యాగ్ లోని కరెన్సీ కట్టలన్నీ కిందపడటం మనకి కనిపిస్తుంది.

ఇక వెంటనే రోడ్డుపై పడ్డ డబ్బుల కట్టలని తిరిగి బ్యాగ్ లో వేసి భయంభయంగా అక్కడి నుండి పారిపోతాడు. మరి సన్నీ ఎందుకిలా చేశాడు? డబ్బులు దొంగించాల్సిన అవసరం ఏంటీ? అన్నది తెలియాల్సి ఉంది. ఇక సన్నీ దొంగతనం చేస్తున్నట్టు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా లేదా నిజంగానే సన్నీ ఏదైనా తప్పు చేశాడా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే హౌస్ నుండి బయటికొచ్చాక ఒక వైపేమో ఇండస్ట్రీలో సోహెల్ దూసుకెళ్తుంటే.. మరోవైపు క్రేజ్ లేక సన్నీ సతమతమవుతున్నాడు. తన ఫస్ట్ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ కావటంతో ప్రస్తుతం సన్నీకి చేతిలో మంచి సినిమాలు ఏవి లేవు.

Latest News

More Articles