Monday, May 6, 2024

లాభాల్లో టాప్ గేర్‎లో మారుతీ..చరిత్రలో అతిపెద్ద డివిడెండ్ .!

spot_img

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు కంపెనీ మారుతీ సుజుకి త్రైమాసిక ఫలితాల్లో టాప్ గేర్ దూసుకుపోయింది. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో స్టాండలోన్ పద్దతిలో రూ. 3,877.8కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది మార్చిలో నమోదు అయిన రూ. 2,623.6కోట్లతో పోలిస్తే లాభం 47.శాతం పెరగడం గమనార్హం. విక్రయాల్లో గణనీయమైన పెరుగుదల నమోదు కావడంలో లాభాలు పెరగడానికి దోహదపడింది.

మారుతీ సుజుకి ఇండియా బోర్డు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 125 సంవత్సరాంతపు డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. మారుతీ చరిత్రలో ఇదే అతిపెద్ద డివిడెండ్. మారుతీ సుజుకి ఇండియా జూలై 8, 2004 నుండి 20 సార్లు డివిడెండ్ ప్రకటించింది. గత 12 నెలల్లో కంపెనీ ఒక్కో షేరుకు రూ.90 ఈక్విటీ డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుత షేర్ ధర ప్రకారం కంపెనీ డివిడెండ్ రాబడి 0.71 శాతం. కంపెనీ 2023 సంవత్సరంలో రూ. 90 మరియు 2022 సంవత్సరంలో రూ. 60 డివిడెండ్ ఇచ్చింది.

శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మారుతీ సుజుకీ ఇండియా షేర్లు క్షీణతతో ముగిశాయి. కంపెనీ షేర్లు 1.70 శాతం లేదా రూ.219.05 తగ్గి రూ.12,687.05 వద్ద ముగిశాయి. ఈ షేర్ 52 వారాల గరిష్టం రూ.13,066.85. కాగా, 52 వారాల కనిష్ట ధర రూ.8,470. శుక్రవారం బిఎస్‌ఇలో మారుతీ సుజుకీ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.3,98,884.12 కోట్ల వద్ద ముగిసింది.

ఇది కూడా చదవండి: ప్రశాంతంగా ముగిసిన రెండో విడత ఎన్నికలు.!

Latest News

More Articles