Monday, May 6, 2024

ప్రశాంతంగా ముగిసిన రెండో విడత ఎన్నికలు.!

spot_img

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలు చోట్లు స్వల్ప ఉద్రిక్తలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88లోకసభ స్థానాల్లో ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతుంది. ఛత్తీస్ గఢ్ లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మూడు గంటలకే పోలింగ్ ను ముగించారు.

సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5గంటల వరకు 61శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కేరళ, పశ్చిమ బెంగాల్లోని కొన్ని పోలింగ్ బూత్ లలో ఈవీఎంలలో లోపాలు, బోగస్ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు ఈసీ తెలిపింది. యూపీ, మథుర, రాజస్థాన్ లో బన్స్ వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్భానిలలో పలు గ్రామాల్లో పలు కారణాలతో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించి నిరసన తెలిపారు.

ఇది కూడా చదవండి: ఓటేసేందుకు క్యూలో నిల్చుకున్న ఇస్రో చీఫ్..వైరల్ వీడియో.!

Latest News

More Articles