Sunday, May 5, 2024

ఖమ్మం పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

spot_img

నిరుద్యోగుల కోసం ఖమ్మం పోలీసులు కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ మేళా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఖమ్మం పోలీసుల ఆధ్వర్యంలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 150 ప్రైవేటు కంపెనీలతో కలిసి ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వివిధ కంపెనీలలో 8,130 ఉద్యోగాలను జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లు ఖమ్మం పోలీస్ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా యువత, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం సీపీ విష్ణు వారియర్ సూచించారు. ఇప్పటికే 15 వేల మంది యువత పోలీస్ శాఖ దగ్గర తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. నేరుగా కూడా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని సీపీ విష్ణు వారియర్ తెలిపారు. ఖమ్మం ఎస్.బి.ఐ.టీ కాలేజీలో ఉదయం 9:30 నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ జాబ్ మేళాకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ వి పి గౌతమ్ , సిపి విష్ణు వారియర్ ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నారు.

Latest News

More Articles