Wednesday, May 1, 2024

వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్ రెడ్డి

spot_img

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభం నాటి నుండి రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు మంత్రి హరీశ్ రావు. అధికారంలో ఉన్నపుడు కూడా కాంగ్రెస్ అదే పరిస్థితన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ అర్థరాత్రి పూట కరెంట్ ఇచ్చి అరిగోస పెట్టింది. ఎరువులు ఇవ్వకుండా రైతులను బాధ పెట్టింది. 2009 లో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది. ప్రాజెక్టులు కట్టలేదు. నీళ్ళు ఇవ్వలేదు.అసెంబ్లీ దగ్గర మేము ధర్నా చేస్తే పట్టించుకోలేదు. నాడు అధికారంలో ఉండి రైతులను గోస పెట్టింది. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో రైతుబంధు ఆపేశారని విమర్శించారు. ఇక్కడ కూడా రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు.

ఇది కూడా చదవండి: జనవరిలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు

వ్యవసాయం దండగ అన్నోడికి వారసుడు రేవంత్ రెడ్డి అని అన్నారు మంత్రి హరీశ్ రావు. మూడు గంటల కరెంట్ చాలు అన్నడు. అక్టోబర్ 23న మానిక్ రావు తాక్రే రైతు బంధు వేయోధ్దు అని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ లో మీటింగ్ పెట్టి చెప్పారు.భట్టి రైతు బంధు దుబారా ఆంటే, రేవంత్ రైతులు బిచ్చగాల్లు అంటారు.

రైతుల నోటి కాడి బుక్కను లాగేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు. దొంగే దొంగ అన్నట్టు ఉంది కాంగ్రెస్ పరిస్థితి. వంద పిల్లులు తిన్న పులి నేను శాఖాహారి అన్నట్టు ఉంది. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు నవంబర్ 30న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. దేశంలో రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చేతిని అడ్డం పెట్టి రైతు బంధు ఆపలేరు. ఎన్నికలో గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్లు రాస్తున్నారు. రాహుల్ గాంధీ వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నడు.. ఎవరికి ఇచ్చారు సమాధానం చెప్పాలన్నారు మంత్రి హరీశ్ రావు.

ఉద్యమాల గడ్డ మీ మాయ మాటలు ప్రజలు నమ్మరని అన్నారు.కేసీఆర్ మూడో సారి  సీఎం  అవుతారు. 80 సీట్లతో మంచి గెలుపు సాధిస్తాం. కాంగ్రెస్ ఇప్పుడు రైతు బంధు అపొచ్చు కానీ, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వస్తాయి, 6వ తేదీ నుండి మనం రైతు బంధు అమలు చేసుకుందామని తెలిపారు మంత్రి.

ఇది కూడా చదవండి: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్య‌మ ద్రోహి

Latest News

More Articles