Sunday, April 28, 2024

రైతుల నోటి కాడి బుక్కను అడ్డుకుంటారా? కాంగ్రెస్ పార్టీపై హరీష్ ఫైర్

spot_img

జహీరాబాద్: కార్తీక పౌర్ణమి సాక్షిగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి హరీష్ రావు కోరారు. జహీరాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ లో నాన్ లోకల్ నాయకులు కనీసం మంచినీరు, కరెంటు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ వారు ఐదు గంటలు కరంట్ చాలు అంటున్నారు, 24 గంటల కరెంటు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. రాహుల్ గాంధీ హామీ ఇచ్చినా కర్ణాటకలో మీటింగ్ పెట్టుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి రైతులకు వ్యతిరేకమే.. రైతన్నలు ఓటుతో బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్ రైతు బంధు వద్దని ఎన్నిక అధికారులకు దరఖాస్తు పెట్టారు. నోటి కడి బుక్కను అడ్డుకుంటారా.  ప్రజలకు మాకు ఉన్నది ఓటు బంధం కాదు పేగు బంధం. కాంగ్రెస్ పార్టీని గ్రామ పొలిమేర నుండి తరిమి కొట్టాలి. ప్రజలు కాంగ్రెస్ కు ఓటుతో పోటు పొడవండి. రైతు బంధు కథం కావాలా కాంగ్రెస్ కథం కావాలా? ప్రజలు ఆలోచించి ఓటు వేయండి. సంగమేశ్వర ప్రాజెక్టు తో గోదావరి నీళ్లు జహీరాబాద్ రైతుల కాళ్ళు కడుగుతం. రిస్కువద్దు కారుకు ఓటు గుద్దు. కాంగ్రెస్ అభ్యర్ధి అనుకోకుండా గెలిచిన బీజేపీలోకి వెళుతాడని చెప్పారు.

Latest News

More Articles