Friday, May 10, 2024

కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి రైతులకు వ్యతిరేకమే.. రైతన్నలు ఓటుతో బుద్ధి చెప్పాలి

spot_img

నిజామాబాద్: రైతు బంధు ఆన్ గోయింగ్ పథకమని, ఇప్పటివరకు 65లక్షల మంది కి 77 వేల కోట్లు ఇచ్చినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అభద్రత బావంతో కాంగ్రెస్ పిర్యాదు చేస్తుందని, రైతుల నోటి కాడి బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని ఆమె ధ్వజమెత్తారు. రైతన్నలు తమ ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి రైతు వ్యతిరేకి అని పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

Also Read.. రైతుబంధు పంపిణీ అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ

తెలంగాణకు కాంగ్రెస్, బిజెపి పార్టీల జాతీయ నాయకులు మిడుతల దండులా వచ్చి దాడి చేస్తున్నారు. ఈ నాయకులు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఎక్కడ ఉన్నారు. 9 మండలాలను అక్రమంగా ఆంధ్రలో కలిపితే ఎందుకు మాట్లాడలేదు. భారత్ జొడో యాత్రలో దేశం అంత తిరిగిన రాహుల్ తెలంగాణ గురించి మాట్లాడలేదు అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగింది. సాగు నీరు , తాగు నీరు సమృద్ధిగాగా అందుతున్నాయి. మానవీయ కోణంతో పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ పై పిచ్చి కూతలు కూస్తున్నారు. 100 బుల్డోజర్ లు తెస్త అని యోగి అంటున్నారని మండిపడ్డారు.

Also Read.. వచ్చే నెల 19న ఐపీఎల్‌ మినీ వేలం.. ముంబైకు హార్దిక్‌ పాండ్య 

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయం. బిడ్డ పుట్టిన దగ్గర నుండి వృద్ధుల వరకు అందరి సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారు. బిజెపి, బిఅర్ఎస్ ఒక్కటే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదా? ఢిల్లీ నుండి వచ్చిన నాయకులు ఎన్నికలు అయిపోగానే ఢిల్లీ వెళ్లి పోతారు. కేసీఆర్ ప్రజల మధ్యన ఉంటాడు. 60ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది ఏంటి? బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ కు నష్టం చేసేవే. కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తూ అరాచకాలు సృష్టిస్తుందని విమర్శించారు.

ఉద్యోగులకు పిఅర్సి, ఐఅర్ ఇచ్చుకున్నాము. సింగరేణి ప్రైవేటీకరీకరణ చేసిన కాంగ్రెస్ ఇపుడు కపట ప్రేమ నటిస్తోంది. బిఅర్ఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. కార్పొరేట్లు ,పెద్ద కంపెనీ లకు కొమ్ము కాసే పార్టీ బిజెపి. దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణలోనే. మతం పేరుతో ఒక పార్టీ , కులంతో పేరుతో మరో పార్టీ నడుస్తుంది. మంచి వాళ్ళు కావాల్నా, ముంచేటోళ్లు కావాల్నా.. రైతు బంధు కవాల్నా, రాబందులు కావాల్నా.. అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక ముసాయిదా తయారు చేస్తామన్నారు. బిఅర్ స్ మేనిఫెస్టో నిరుపేదలకు వరమన్నారు. బీఆర్ఎస్ పార్టీని మరో సారి ప్రజలు పెద్ద మనసుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

Latest News

More Articles