Friday, May 10, 2024

47 ఏండ్ల కల నిజమైంది.. డేవిస్ క‌ప్ చాంపియన్‌గా ఇట‌లీ

spot_img

1976 త‌ర్వాత ఇట‌లీ డేవిస్ క‌ప్ చాంపియన్‌గా నిలిచింది. ఫైన‌ల్లో జ‌న్నిక్ సిన్న‌ర్ నేతృత్వంలోని ఇట‌లీ బ‌ల‌మైన ఆస్ట్రేలియాను మ‌ట్టికరిపించి విజేత‌గా నిలిచింది. సొంత ప్రేక్ష‌కుల స‌మక్షంలో రెచ్చిపోయిన ఇట‌లీ ఆట‌గాళ్లు ఆసీస్‌ను ఓడించారు. దీంతో 47 ఏండ్ల ఇట‌లీ అభిమానుల నిరీక్షణ ఫలించింది.

ఇది కూడా చదవండి: వచ్చే నెల 19న ఐపీఎల్‌ మినీ వేలం.. ముంబైకు హార్దిక్‌ పాండ్య 

హోరాహోరీగా జ‌రిగిన ఫైన‌ల్లో మొద‌ట మాటీయో అర్నాల్డి.. ఆస్ట్రేలియా ఆట‌గాడు అలెక్సీ పొపిరిన్‌పై గెలుపొందాడు. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో అర్న‌ల్డీ 7-5, 2-6, 6-4తో విజ‌యం సాధించ‌డంతో ఇట‌లీ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ త‌ర్వాత సిన్న‌ర్ త‌న ఫామ్ కొన‌సాగిస్తూ 6-3, 6-0తో డి మినార్‌ను చిత్తు చేశాడు. దాంతో ఇట‌లీ డేవిస్ క‌ప్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది.

Latest News

More Articles