Tuesday, May 7, 2024

ఈ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ కావాలా? ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాల్నా?

spot_img

బీజేపీ, కాంగ్రెస్ లది కుర్చీల కోసం కొట్లాట, ఖాళీ కుర్చీల తండ్లాట. మన మీటింగులకేమో ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారని తెలిపారు మంత్రి హరీశ్ రావు. రాని సీఎం పదవి కోసం కాంగ్రెస్ లో కొట్లాట చూస్తున్నామన్నారు. నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు మంత్రి హరీశ్ రావు. కరోనా కాలంలో మన దగ్గర పైసలు లేక రైతు బంధు కుదరదని అధికారులు చెప్పారు. కానీ కేసీఆర్ ఒప్పుకోలే… మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి అయినా సరే రైతులకు రైతుబంధు పెట్టాలని కరాఖండీగా చెప్పిండు. మన ఇంటోడు కేసీఆర్ కావాలా? లేక మరక పడ్డోడు రేవంత్ రెడ్డి కావాలా?. ఈ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ కావాలా? ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాల్నా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ ని శాసించేది మీరు… బీఆర్ఎస్ పార్టీని నడిపేది మీరు అని అన్నారు మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలను ఢిల్లీలో ఉండే బాసులు నడిపిస్తరు. మీ కమాండ్ తో నడిచే కేసీఆర్ కావాలా? ఢిల్లీ రిమోట్ తో నడిచే కాంగ్రెస్, బీజేపీలు కావాలా? అని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పంటలు పండిందా లేదా? కర్ణాటక గెలిచినంక కాంగ్రెసోళ్లు ఒడ్డున పడ్డరు. ఇప్పుడు సమస్యను ఎవరిని అడగాలో తెలియక అక్కడోళ్లు పరేషాన్ అవుతున్నారు. మొన్నటివరకు కర్ణాటక మోడల్ అని చెప్పి.. ఇప్పుడు మాట మార్చిండ్రు కాంగ్రెస్ లీడర్లు. రేవంత్ రెడ్డి 3గంటల కరెంటు, 10 హెచ్ పీ మోటార్ అంటడు. ఆయనకు దమాక్ ఉందా అసలు? అని అన్నారు.

కాంగ్రెస్ ని నమ్మి రిస్క్ లో పడొద్దన్నారు మంత్రి హరీశ్ రావు. తర్వాత మమ్మల్ని అడగొద్దు. రిస్క్ వద్దు కారుకు గుద్దు అని అన్నారు. కాంగ్రెస్ ప్రతీ రైతుకు ఏడాదికి 15 వేలు ఇస్తా అంటుంది. కానీ కేసీఆర్ ఎకరాకు 16 వేలు ఇస్తా అని అన్నారు. ఎన్నికల కమిషన్ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతినిచ్చింది. సోమవారం పొద్దున చాయి తాగే వరకు మీ ఫోన్లు టింగు టింగుమంటాయన్నారు. దేవుడు మన తరపున ఉన్నడు. రైతులకు డబ్బులు ఇవ్వడం న్యాయమేనని దీవించిండు.

ఇది కూడా చదవండి: కర్ణాటకలా మోసపోవద్దు. భవిష్యత్ అందించే నాయకుడు కేసీఆర్

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు, తండాలు గ్రామపంచాయితీలు, నల్లాల ద్వారా నీళ్లు, రోడ్లు వేయించామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. రైతుబంధుకు ఇచ్చినట్టు రుణమాఫీకి కూడా అనుమతి ఇస్తే అది కూడా చేసేస్తాం. ఒకవేళ అనుమతి రాకపోతే మళ్లా వచ్చేది కేసీఆరే కాబట్టి వడ్డీతో కలిపి మాఫీ చేస్తాం. రైతు బంధు కింద ఇప్పటివరకు 80వేల కోట్లు ఇచ్చాం. అలాంటిది మిగిలిన రుణమాఫీ డబ్బులు 4 వేల కోట్లు ఇవ్వలేమా? ఇళ్ల జాగలు లేని వారికి జాగ ఇచ్చి ఇళ్లు కూడా కట్టిస్తామని హామీ ఇస్తున్నాం. కరోనా వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న వచ్చి క్లారిటీ ఇచ్చింది. బోరు బావుల కాడ మీటర్లు పెట్టలేదని 28వేల కోట్లు ఆపేసినమని స్పష్టంగా చెప్పింది. కేసీఆర్ 28 వేల కోట్లు వదులుకున్నడు కానీ మోటార్లకు మీటర్లు పెట్టలేదు.గొంతులో ప్రాణం ఉండగా రైతులకు మీటర్లు పెట్టనివ్వనని తెగేసి చెప్పిన కేసీఆర్ ని మనం కాపాడుకోవాలి. కాంగ్రెసోళ్లు మార్పు కావాలంటున్నరు. ఏం మార్పు కావాలి. 2 వేల పింఛను 200 చేస్తరా? 24 గంటల కరెంటు తీసి 3 గంటల కరెంట్ ఇస్తారా? ఈ మార్పు మనకు కావాలా? అని ప్రశ్నించారు మంత్రి.

నాడు బొంబాయికి వలసలు ఉండేవి. నేడు బొంబాయి, చత్తీస్ గఢ్ నుంచి వచ్చి నాట్లు వేస్తున్నరు. ఇది అసలు సిసలు కేసీఆర్ తెచ్చిన మార్పు. గిరిజనులు అడిగినవన్నీ చేసినం. ఇక ఒక్కటే బాకీ ఉన్నం. ఈ సారి బీఆర్ఎస్ గెలిస్తే గిరిజన బంధు ఇచ్చి కాపాడుకుంటాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పేకాట క్లబ్బులు బంద్ చేసిండు. గతంలో పేకాట వల్ల ఎన్నో సంసారాలు ఖరాబైనయి. కాంగ్రెస్ మళ్లీ వస్తే గల్లీకో పేకాట క్లబ్ తెచ్చి మహిళల పుస్తెల తాడు తెంపుతుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వారి సొంత రాష్ట్రంలో గెలిచింది కేవంల రెండు సీట్లే. వారు వచ్చి మనల్ని మోసం చేయాలని చూస్తే మనం మోసపోదామా?  సొంత రాష్ట్రంలో ప్రజలు బండకేసి కొట్టిండ్రు. మీరు పనికి రారని అక్కడి ప్రజలు తరిమేసారని తెలిపారు మంత్రి హరీశ్ రావు. నర్సంపేటలో బీఆర్ఎస్ గెలవంగనే నెక్కొండను మున్సిపాలిటీగా జీవో జారీ చేసుకుందామన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దు

Latest News

More Articles