Thursday, May 9, 2024

కాంగ్రెస్ వాళ్లే ముక్కు నేలకు రాసి.. 100 సార్లు క్షమాపణలు చెప్పాలి

spot_img

నల్గొండ: ఇన్నాళ్లు  మూగబోయిన ప్రతిపక్షాల నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తే పెద్ద లీడర్లు అవతామని కాంగ్రెస్ వాళ్లు కలలు కంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కరోనా సమయంలో భయపడి ఇళ్లలో ప్రతిపక్షాల నేతలు దాక్కున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.

నల్గొండ జిల్లా ను సర్వ నాశనం చేసి, ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు కాంగ్రెస్ వాళ్లు. భట్టి విక్రమార్క తన ఉనికి కోసం పాదయాత్ర లు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని క్షమాపణలు చెప్పమని అడిగే హక్కు, అర్హత కాంగ్రెస్ వాళ్లకు లేదు. నల్గొండ జిల్లా ప్రజలను గోస పెట్టించిన కాంగ్రెస్ వాళ్లే ముక్కు నేలకు రాసి 100 సార్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సిగ్గుండలి కాంగ్రెస్ వాళ్లకు. ఫ్లోరైడ్ ని రూపుమాపినందుకు క్షమాపణలు చెప్పాలా? ఫ్లోరైడ్ పాపం కాంగ్రెస్ వాళ్లదే… జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నాయకులకు మొకరిల్లారు పదవుల కోసం. కేసీఆర్ ఆనాడే ఊరు ఊరు తిరిగి ఫ్లోరైడ్ భూతం పై పోరాటం చేశారు. అధికారంలోకి రాగానే భగీరథ  పథకంతో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశారు. అది తెలియదా ప్రతిపక్షాలకు. కాంగ్రెస్  హయాంలో నల్గొండ జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు.

ఇంకా సిగ్గు లేకుండా  విమర్శలు చేస్తూ, చర్చ పెడదాం అంటున్నారు. మరి పెడదమా చర్చ. సాగర్ కాల్వ కింద ఉండి ఇన్నాళ్లు నీళ్లు రాణి రాజవరం మేజర్ మీద పెడదామా. 60 ఏళ్లుగా రాజవరం మేజర్ కి నీళ్లు ఇచ్చారా. మరి ఇప్పుడు రాజవరం మేజర్ కింద పుష్కలంగా నీళ్లు పారుతున్నాయి. సాగర్ నీళ్లను ఆంధ్రకు దోచి పెడుతుంటే నోళ్లు ముసుకున్నారు ఇదే కాంగ్రెస్ వాళ్లు. కాంగ్రెస్ నాయకుల నగ్న స్వరూపం ప్రజలకు తెలుసని మంత్రి నిప్పులు చెరిగారు.

శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు పెద్ద మోసం. టీబీఎం మెషిన్ పెట్టి, టెక్నాలజీ పేరుతో,ఎల్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలోను నాన్చుడు  ధోరణి అవలంభిoచారు కాంగ్రెస్ వాళ్ళు.  ఆనాడు రాజశేఖర్ రెడ్డికి అమ్ముడు పోయిన నీచులు కాంగ్రెస్ వాళ్లు. పదవుల కోసం పెదవులు ముసుకున్న నీచులు కాంగ్రెస్ వాళ్లు. వ్యవసాయం గురించి కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళించినంట్లు ఉంది. నల్గొండ జిల్లాలో ఆనాడు మూడు లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు రాలె. ఇవ్వాళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తున్నాయని వివరించారు.

కృష్ణా డెల్టాకు నీరు దోచుకుంటుంటే కళ్ళప్పంగించి చుసారు కాంగ్రెస్ నాయకులు. ఆంధ్ర నాయకులను చుస్తే కాంగ్రెస్ వాల్ల లాగులు తడుస్తాయి. విద్యుత్ గురించి కూడా మాట్లాడుతున్నారు.ఇది మరి  హాస్యాస్పదంగా ఉంది. భట్టి విక్రమార్క పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తాడు. అన్ని అబద్ధాలే మాట్లాడుతాడు. విద్యుత్ ప్రాజెక్ట్ ల విషయంలో నిజాలు మాట్లాడుకోవాలి. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ వాళ్లు ఎందుకు ఉచిత విద్యుత్  ఇవ్వలేదు. అత్యంత వరి ధాన్యం పండించిన జిల్లాగా నల్గొండ ఖ్యాతి గడిచింది. కాంగ్రెస్ పాలనలో సూర్యపేట జిల్లా కూడా సర్వ నాశనం అయింది. కేసీఆర్ పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సూర్యపేట జిల్లా అన్నదాతలు సిరి సంపదలు పండిస్తున్నారు. ఎక్కడ చర్చ పెడతారో మీరో ప్లేస్ డిసైడ్ చేయండి భట్టి గారు అని సవాల్ చేశారు.

కర్ణాటక లో దిక్కు లేక కాంగ్రెస్ కు ఓటేశారు ప్రజలు. అక్కడ బీఆర్ఎస్ లేదు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకులవి  ఉత్తర కుమార ప్రగల్భాలు. కాంగ్రెస్ నాయకులే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. గోబెల్స్ ను మించి కాంగ్రెస్ నాయకుల మాటలు ఉన్నాయి. చెప్పిన అబద్దాన్నే పదే పదే చెప్పి నిజం అని అనుకునేల కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారు. ప్రజలు అన్ని ఆలోచన చేసే కాంగ్రెస్ వాళ్ళను శాశ్వత నిరుద్యోగులుగా మార్చారు. ఇంకా సిగ్గు రావడం లెదు కాంగ్రెస్ నాయకులకు అని ధ్వజమెత్తారు.

90% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు వచ్చేలా ప్రణాళికలు రచించారు కేసీఆర్. నీళ్లు నిధులు, నియామకాలు అనే మా  ట్యాగ్ లైన్ నిజం చేసి చూపించాం. నిబద్ధతతో పని చేసి  ఫలితం సాధించాము. అందుకే  కాంగ్రెస్ వాళ్లకు కడుపు మండుతున్నది. కేసీఆర్ ని క్షమాపణలు చెప్పమనే హక్కు , అర్హత కాంగ్రెస్ వాళ్లకు లేదు….నల్గొండ ప్రజల ముందు తప్పు ఒప్పుకొని, ముక్కు నేలకు రాయాల్సింది కాంగ్రెస్ వాళ్లు. భట్టి విక్రమార్క విషయాలు తెలుసుకొని  మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్లు దిష్టి బొమ్మల్లాగా తయారయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకులు కుంభకర్ణులు. అభివృద్ధి నిరోధకులు. ధరణి ని రద్దు చేస్తామని  అంటున్న కాంగ్రెస్ వాళ్ళను ఊర్లలోకి రాకుండా తరిమి కొట్టాలి. ప్రజలకు లబ్ది చేసేది ఏది కూడా కాంగ్రెస్ వాళ్లకు ఇష్టం ఉండదు. ఫైరవీలు,దందాలు  కాంగ్రెస్ హయాంలో ఉంటాయి. మళ్ళీ  అవే రోజులు రావాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. కేసీఆర్ కంటే  ఒక్క మంచి పని కూడా చేస్తామని ఏ ఒక్కరు చెప్పడం లేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవాన్  గార్లు తెలంగాణ కు వచ్చి ఇక్కడ అమలు చేస్తున్న మంచి పథకాలు ఆయా రాష్ట్రంల్లో కూడా అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్లకు ఇవి ఏవి కనపడవని మండిపడ్డారు. పాదయాత్ర లు చేస్తూ, కాంగ్రెస్ నాయకులు ఆధిపత్య పోరులో నలిగి పోతున్నారు. గురివింద నీతులు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మరు అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

Latest News

More Articles