Sunday, April 28, 2024

1300 ఏళ్ల మెట్ల బావిని సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి

spot_img

సూర్యపేట: సూర్యపేటలోని వారసత్వ ప్రదేశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన ఆత్మకూరులోని 1300 ఏళ్ల మెట్ల బావిని, చెన్నకేశవ ఆలయాన్ని సందర్శించారు. మెట్లబావి పూడికతీత పనులను పరిశీలించారు.

Also Read.. వ‌న్డేల్లో టాప్ -5 భార‌త‌ బౌల‌ర్ల‌లో సిరాజ్..!

అనంతరం మాట్లాడుతూ.. చెన్నకేశవ స్వామి విగ్రహం క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటిదని చెప్పారు. 18 వ శతాబ్దం నిర్మించిన మెట్ల భావికి 13 శతాబ్దం నాటి కాకతీయ స్థంబాలు ఉన్నాయని వివరించారు. మెట్ల బావికి పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పురావస్తు పరిశోధనలో బయటపడిన 120 ఏళ్ల క్రితం నాటి గణపతి విగ్రహాన్ని కూడా మంత్రి పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Latest News

More Articles