Thursday, May 2, 2024

భారతీయ ఖ్యాతిని నిలబెట్టింది తెలంగాణ రాష్ట్రం

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవం, కవి సమ్మేళనంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాల్గొని మాట్లాడారు. ఎండా కాలం వచ్చిందంటే విసనకర్రలు జోడీగా ఉండేవి.. నేడు 24 గంటలు ఫ్యాన్ వేసుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రతి ఊరిలో నీళ్ళు వచ్చాయి.. ఇది మన రాష్ట్రం సాధించిన ఘనత అని సగర్వంగా చెప్పారు.

‘‘జన నేత మానస పుత్రిక హరితహరంతో తెలంగాణ పచబడ్డది.. కోతులు ఊర్లు విడిచాయి. కవులు ప్రభుత్వాలు చేసే మంచిని ప్రోత్సహించాలి.. చైనా లాంటి కమ్యూనిస్టు దేశాల్లోనూ ఈ సంస్కృతి ఉంది. తెలంగాణ నేల ప్రగతిశీలమైంది.. ఇది అభ్యుదయ నేల. కవుల పట్ల అత్యంత ప్రేమ చూపించే ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు.

యురేనియం తవ్వకాలను నిలిపివేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ.. ఇది ఎంతో సాహసోపేతం నిర్ణయం. భారతీయ ఖ్యాతిని తెలంగాణ రాష్ట్రం నిలబెట్టింది.. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నం. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే 30 ఏళ్లు పట్టేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకే నీళ్లు వచ్చాయి. పాడి ఆవు లాంటి, బంగారు బాతు గుడ్డు లాంటి ఎల్ఐసి, రైల్వేలను అమ్మకానికి పెడుతున్నారు.’’ అంటూ ఆవేదన చెందారు.

Latest News

More Articles