Sunday, May 5, 2024

హ్యాట్రిక్ సీఎంగా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారు

spot_img

హైదరాబాద్: ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందని, హ్యాట్రిక్ సీఎంగా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిస్తార‌ని ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. గురువారం జుబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, చైతన్యవంతమైన గడ్డ అని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి నుంచి తమకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ (BRS) పార్టీకి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న పింక్ వేవ్ చూస్తే బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించి ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. పోలింగ్ శాతం ఎంత ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గెలుపు తధ్యమని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే సంబరాలు జరుపుకుంటున్నామని, ఎమ్మెల్యేలు గెలుపు పట్ల విశ్వాసంతో ఉన్నారని అన్నారు. ప్రజలను తప్పదోవ పట్టించడానికి అనేక ఫేక్ సర్వేలు వస్తుంటాయని, గత ఎన్నికల్లోనూ ఇలానే జరిగిందని చెప్పారు.

Latest News

More Articles