Sunday, May 5, 2024

రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు.!

spot_img

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ఆవర్తనం కారణంగా నగరంలో ఆకాశం మేఘావ్రుతంగా మారింది. రానున్న 48గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సాయంత్రం సమయాల్లో జంటనగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: అమెజాన్ బిగ్ డీల్…ఐదు రోజులపాటు ఏదైనా కొనండి..75శాతం డిస్కౌంట్ పొందండి.!

Latest News

More Articles