Tuesday, May 7, 2024

సైబర్ మోసగాళ్ల నయా ఎత్తుగడ.. ఏకంగా ట్రాఫిక్ పోలీసుల పేరుతో నకిలీ వెబ్ సైట్!!

spot_img

రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వాహనాల చలాన్స్ రాయితీలో చెల్లించేందుకు సర్కార్ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని చాలామంది వాహనదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో రెడీ అయ్యారు. ఇంకేముందు నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా పనులను కానీస్తున్నారు. అనుమానం రాకుండా సొమ్ములు కాజేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో మాయగాళ్ల బారినపడకుండా ఉండేందుకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

గతంలో ఈ విధంగానే ఢిల్లీలో వాహదారుల నుంచి సొమ్ము కాజేసిన సైబర్ ముఠాలోకి హైదరాబాద్ లో కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పెండింగ్ చలాన్లపై ఇచ్చిన రాయితీని తమకు అనువుగా మలుచుకున్నారు. కేవలం అక్షరం మార్పుతో ఫేక్ వెబ్ సైట్ రూపొందించి సోషల్ మీడియా, సెల్ ఫోన్ నెంబర్లకు లింకులు పంపిస్తున్నారు. ఇది నిజమేనని భావిస్తున్న వాహనాదారులు నగతు చెల్లించగానే..అటు వైవు నుంచి నగదు జమ చేసినట్లు మెసేజ్ లు వస్తున్నాయి. పోలీసులు వెబ్ సైట్లో పరిశీలిస్తే చలానాలు అలాగే కనిపించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలా బారినపడకుండా ఉండేందుకు వాహనాదారులు మీ సేవ కేంద్రాలు, పేటీఎం లలో https://echallan tspolice.gov.in/publicview/ద్వారా రాయితీలు చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రోగి చికిత్సకు నిరాకరిస్తే ఐసీయూలో చేర్చుకోవద్దు..!!

Latest News

More Articles