Monday, May 6, 2024

ఫింగర్ ప్రింట్ కాదు..శ్వాసతోనే ఫోన్ అన్ లాక్..!!

spot_img

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ప్రతిఒక్కరి పర్సనల్ డేటాను కలిగి ఉంటుంది. ఇతరు చేతిలోకి వెళ్లకుండా లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటారు. ఇది కూడా ప్రజాదరణ పొందింది. మన ఫోన్ వేరేవారు తీసుకుంటే లాక్ అవ్వడం కారణంగా మన పర్మిషన్ లేకుండా ఎవరూ మన ఫోన్ వాడలేరు..ఓపెన్ చేయలేరు.

ఇది కూడా చదవండి: మనిషి మెదడులో తొలిసారిగా చిప్ అమర్చాం..న్యూరోటెక్నాలజీ కీలక ప్రకటన.!!

అయితే తాజా పరిశోధకులు శ్వాస ద్వారా ఫోన్ అన్ లాక్ అయ్యే ఫీచర్ ను తీసుకువస్తున్నారు. చెన్నైలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లో మహేష్ పంచాగ్నుల, అతని బృందం దీనిపై పనిచేస్తోంది. ఈ శ్వాస పరిజ్నానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్స్ గా డెవలప్ చేసిన తర్వాత సెల్ ఫోన్ అన్ లాక్ తోపాటు సేఫ్టీ కోసం ఉపయోగించుకోవచ్చని ఐఐటీ లో పరిశోధన విద్యార్థి తెలిపాడు. ఈ టెక్నాలజీ వైద్యరంగంలోనూ ఉపయోగపడుతుందన్నారు. ఒక వ్యక్తి ఊపిరి వదిలేటప్పుడు శ్వాసకోశం ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తుంది. దీని ఆధారంగా వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరు చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం ద్వారా చూపించారు. ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరిచేందుకు ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయని తెలిపారు.

Latest News

More Articles