Sunday, April 28, 2024

త్వరలోనే కార్తీకదీపం- 2…డాక్టర్ బాబు, వంటలక్క కూడా ఉన్నారా?

spot_img

కార్తీకదీపం సీరియల్…బుల్లితెరమీద ఓ సంచలనం. ఏళ్లకు ఏళ్లుగా ఈ సీరియన్ ను ప్రేక్షకులు ఆదరించారు. టీఆర్పీలోనూ రికార్డు బద్దలు కొట్టింది. స్టార్ మాలో 2017లో ఈ సీరియల్ షురూ అయ్యింది. 2023 వరకు ఏకధాటిగా 1569 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యింది. రాత్రి 8 అయ్యిందంటే చాలు కార్తీకదీపం ప్రతిఇంట్లో వినిపించేంతగా ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఈ సీరియల్ అంతగా విజయం సాధించిందంటే అందులోని పాత్రలే కారణమని చెప్పవచ్చు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత..ఈ మూడు క్యారెక్టర్స్ జనాలను ఆకట్టుకున్నాయి. డాక్టర్ బాబు, వంటలక్కను తమ ఇంట్లో మనుషులుగా ప్రేక్షకులు భావించారంటే ఈ సీరియల్ కు ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక మోనితను తమ ఇంట్లో ఓ శత్రువుగా భావించారు. అయితే తర్వాత కాలంలో ఈ మూడు పాత్రలు లేకుండా కార్తీకదీపంపై ప్రయోగం చేశారు. డాక్టర్ బాబు కూతుళ్లను పెద్దవాళ్లుగా చూపించారు. డాక్టర్ బాబు, వంటలక్క ప్రమాదంలో మరణించినట్లుగా ముగింపు కార్డు ఇచ్చేశారు.

ఆ ప్రయోగం ప్రేక్షకలకు చిరాకు తెప్పించింది. వంటలక్క లేని సీరియల్ ను చూడలేమని చెప్పేశారు. కార్తీక దీపం సీరియల్ ముగిసి ఏడాది అవుతుంది. అయితే ఇప్పుడు కార్తీక దీపం 2 ను ప్రకటించారు. త్వరలోనే స్టార్ మాలో ఈ బ్లాక్ బస్టర్ సీరియల్ రెండో భాగం త్వరలోనే ప్రసారం కాబోతోంది. ఇఫ్పటికే ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే అయితే అందులో ఎవరి పాత్రలను కనిపించలేదు. దీంతో డాక్టర్ బాబు, వంటలక్క పార్ట్ 2లో ఉంటారా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది.

అయితే సస్పెన్స్ పై డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చాడు. తాను పార్ట్2 లో నటిస్తున్నట్లు చెప్పాడు. వంటలక్క కూడా కనిపిస్తుందట. మోనిత కూడా విలన్ గా ఎంట్రీ ఇస్తుందట. గతంలో మాదిరిగానే పార్టీ 2 కూడా ఉంటుందట. మొత్తానికి ఈ ప్రకటనలో కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పార్ట్ 2 ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: మానుకోట జిల్లాలో జోరుగా ఇసుక దందా..పట్టించుకోని అధికారులు..!!

Latest News

More Articles