Saturday, May 4, 2024

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల 12 వరద గేట్లు ఎత్తివేత

spot_img

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ కారణంగా హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో మూసీ నదిపై ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల 12 వరద గేట్లను తెరిచి.. నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లను రెండు అడుగుల మేర తెరిచింది. ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం స‌మయంలో ఇన్ ఫ్లో 1,500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,380 క్యూసెక్కులు నమోదైంది. అదేవిధంగా హిమాయత్ సాగర్‌కు ఎగువ నుంచి భారీ ఇన్‌ఫ్లోలు వ‌స్తుండ‌టంతో.. జలాశయంలోకి ఇన్ ఫ్లో 4 వేలకు చేరింది. దీంతో ఆరు క్రెస్ట్ గేట్లను తెరిచి 4,120 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్టు తెలిపారు అధికారులు.

Latest News

More Articles