Monday, May 6, 2024

సుప్రీంకోర్టు ఆగ్రహం..మరోసారి పతంజలి క్షమాపణలు.!

spot_img

ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలక్రుష్ణ బుధవారం మరోసారి వార్త పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. వీరు ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వడం గత  రెండు రోజుల్లోనే రెండోసారి. సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంత్రుప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో క్రితం రోజుతో పోలిస్తే మరింత పెద్ద పరిమాణంలో క్షమాపణల ప్రకటనలు ఇచ్చింది.

తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసుులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్త పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి గ్రూప్ నిన్న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆ కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా 67పత్రికల్లో ఆ ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ..క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్ సైజునే వాడారా?అంతే పరిమాణంలో క్షమాపణలను ప్రచురించారా? అనేప్రశ్నలు వేశారు. దీంతో బహిరంగ క్షమాపణలను పెద్దసైజులో మరోసారి ప్రచురిస్తామని రోహత్గీ కోర్టుకువిన్నవించారు. ఈ నేపథ్యంలోనే నేడు మరోసారి వార్తపత్రికల్లో క్షమాపణలు తెలిజేసింది పతంజలి.ఈ కేసులో తదుపరి విచారణకు కోర్టు ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్: రూ.20 కే భోజనం

Latest News

More Articles