Monday, May 6, 2024

విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్: రూ.20 కే భోజనం

spot_img

వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనం అందిస్తున్నారు. ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ పేరుతో రూ.20 లకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం రైల్వే స్టేషన్ లో జనరల్ బోగీలు ఆగే చోట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. రూ.20 లకే ఎకానమీ మీల్స్, రూ.50 లకు స్నాక్ మీల్స్ అందిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలని ఐఆర్ సీటీసీతో కలిసి ఈ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ స్పెషల్ కౌంటర్ ఉంటుందన్నారు.  ప్రస్తుతానికి ఈ కౌంటర్లను ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: నేటి నుంచి గులాబీ బాస్ రోడ్ షో.. మిర్యాలగూడ నుంచి ప్రారంభం.!

Latest News

More Articles