Saturday, May 4, 2024

దేశ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త చ‌రిత్ర‌.. కరీంనగర్ మెడికల్ కాలేజీకి అనుమతి..!

spot_img

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. వైద్య విద్యలో మరో మైలురాయి చేరుకుంది తెలంగాణ. తాజా అనుమతితో ఈ ఏడాది రాష్ట్రంలో 9 మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తులు సాధించి దేశ చ‌రిత్ర‌లోనే తెలంగాణ స‌రికొత్త చ‌రిత్ర‌ సృష్టించిందని తెలిపారు మంత్రి హరీష్ రావు.

వైద్య విద్యలో మరో మైలురాయి చేరుకుంది తెలంగాణ. క‌రీంన‌గ‌ర్ ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీకి అనుమతి రావడం సంతోషించదగ్గ విషయం అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హారీష్‌ రావు పేర్కొన్నారు. జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ స్థాపించాల‌న్న సీఎం కేసీఆర్ ల‌క్ష్యంలో ఇది మ‌రో ముంద‌డుగు అన్నారు.

తెలంగాణ ఏర్ప‌డే నాటికి ఉన్న మెడిక‌ల్ కాలేజీల సంఖ్య కేవ‌లం 5. తొమ్మిదేండ్ల‌లోనే సీఎం కేసీఆర్ మార్గ‌నిర్దేశ‌నంలో ఏర్పాటైన మెడిక‌ల్ కాలేజీల సంఖ్య 21. మొత్తం 26 గా నమోదు కానుంది. జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేయ‌డం ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స్పెషాలిటీ సేవ‌లు చేరువ అవడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చేరువైంది.

Latest News

More Articles