Monday, May 6, 2024

కవిత సూపర్ క్లాస్ పీకింది.. బీజేపీపై ప్రకాష్ రాజ్ సెటైర్

spot_img

బీజేపీతో అంటకాగినప్పుడు పలు పార్టీల్లో వారసత్వ రాజకీయాలు బీజేపీకి కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. బీజేపీకి లొంగితేనే కుటుంబ పార్టీలు ఆ పార్టీకి ఆమోదయోగ్యమా ? అని కవిత ప్రశ్నించారు. అయితే, ఒక టీవీ సంస్థ నిర్వహించిన సదస్సులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్సీ కవితకు తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కవిత చేసిన ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తుండటమే కాకుండా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వదని, గత పది సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోవడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని సదస్సులో కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీజేపీ హిందుత్వ రాజకీయాలను సమర్ధవంతంగా ఎండగట్టారు.

ఇక కవిత చేసిన ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ తమిళ ప్రజలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. వాస్తవాలు, గణాంకాలతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకు కల్వకుంట్ల కవిత గట్టిగా సమాధానం ఇచ్చారని ఆ ట్వీట్ల‌లో పేర్కొన్నారు. కుటుంబ పార్టీలు అంటూ విమర్శించే అర్హత బీజేపీకి లేదని స్పష్టం చేశారు. మరొకవైపు, బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ కవిత చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సమర్ధించారు. కవిత మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసిన ఆయన కవిత మంచి క్లాస్ తీసుకున్నారు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్.

Latest News

More Articles