Saturday, May 4, 2024

భారత విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు రిపబ్లిక్ డే బహుమతి..!!

spot_img

గణతంత్ర దినోవ్సతానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మరింత ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్ లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. 20230 నాటికి దాదాపు 30వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

భారత విద్యార్థులకు ఫ్రాన్స్ ఏ విధంగా తోడ్పాటు అందించనుందో మెక్నార్ వివరించారు. ఫ్రెంట్ మాట్లాడలేని విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫ్రెంచ్ నేర్చుకునేలా విద్యార్థుల కోసం పలు సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్ వర్క్ ను క్రియేట్ చేస్తామని వివరించారు. ఫ్రాన్స్ లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని మెక్రాన్ వెల్లడించారు.

అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం జనవరి 25, గురువారం,మధ్యాహ్నం 2.30 గంటలకు జైపూర్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయనకు హస్తకళల దుకాణంలో అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు.

ఇది కూడా చదవండి: చిరంజీవి గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే..!!

Latest News

More Articles