Tuesday, May 7, 2024

టీఎస్‌బీపాస్‌కు దేశం ఫిదా..!

spot_img

హైదరాబాద్‌: తెలంగాణ నేడు ఆచరిస్తుంది.. రేపు దేశం పాటిస్తుంది అన్న నానుడి మరోసారి నిజమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం (టీఎస్‌బీపాస్‌) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

ప్రతి పట్టణంలో ఇండ్ల నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు ఇస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.ఇండ్ల నిర్మాణాలకు సులువుగా అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పంజాబ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాలు ప్రకటించాయి.

2020 నవంబర్‌ 16న టీఎస్‌బీపాస్‌ ప్రారంభమైంది. ఇప్పటివరకు మొత్తం 2.45 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇన్‌స్టాంట్‌ రిజిస్ట్రేషన్‌ కింద 22,643 దరఖాస్తులు, ఇన్‌స్టాంట్‌ అప్రూవల్‌లో 2,02,512, సింగిల్‌ విండో విధానంలో 17,829 వచ్చినవి ఉన్నాయి. సింగిల్‌ విండో విధానంలో 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో, 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు.

Latest News

More Articles