Sunday, May 5, 2024

చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ నాగార్జునపై బదిలీ వేటు

spot_img

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటుపడింది. వివాదాలకు కేరఫ్‌ అడ్రస్‌లా పీఎస్‌ మారడం, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండంతో ఇన్‌స్పెక్టర్‌ నాగార్జునను రాచకొండ సీపీ సుధీర్‌ బాబు  సస్పెండ్‌ చేశారు. ఆయనను మల్టీజోన్‌-2కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. చైతన్యపురి ఠాణాలో కోర్టు వారెంట్లు అమలు చేసే బృందంలోని హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌బాబు, కానిస్టేబుల్ బీ. మల్లేశం, కోర్టు కానిస్టేబుల్ ఎం.నరేందర్‌లు ఐదు రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడి నుంచి రూ.3 లక్షలు లంచం వసూలు చేశారు.

ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ ముగ్గురు కాని స్టేబుళ్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించింది. ఈ తతంగం కొన్నాళ్లుగా నడుస్తున్నా ఇన్‌స్పెక్టర్ పసిగట్టక పోవడం, స్టేషన్‌లో విధులు నిర్వహించే ఇద్దరు ఎస్సైల మధ్య మాటామాటా పెరిగి దూషించుకున్నట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాలతో ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. డీఐ నాగరాజ్ గౌడ్‌కు ఇన్‌స్పెపెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.

ఇది కూడా చదవండి: అయోధ్యలో కోహ్లీ డూప్ తో సెల్ఫీల కోసం ఎగబడిన జనం

Latest News

More Articles