Saturday, May 4, 2024

ఫ్యాన్స్‎లో వర్షం టెన్షన్..నేడు ఆహ్మాదాబాద్ లో వాతావరణం ఎలా ఉంటుందంటే..!!

spot_img

ODI ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు అంటే నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ప్రపంచ కప్ 13వ సీజన్ (IND vs AUS World Cup Final) ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఆస్ట్రేలియా 5 సార్లు, భారత్ 2 సార్లు ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచం కన్నంతా ఈ మ్యాచ్ పై ఉంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. కాగా, మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ వాతావరణం ఎలా ఉంటుందోనని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం, ఆదివారం అహ్మదాబాద్‌లో వాతావరణం మ్యాచ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉందని వెల్లడించింది. ప్రకాశవంతమైన వెలుతురుతో అత్యధిక ఉష్ణోగ్రత సుమారు 33 డిగ్రీలు ఉంటుంది. కనిష్టంగా 20 డిగ్రీలు ఉండవచ్చని పేర్కొంది. మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం లేదని ఐఎండీ స్పష్టం చేసింది. వాతావరణం ఖచ్చితంగా ప్రకాశవంతంగా ఉంటుందని…మొత్తం 100 ఓవర్ల మ్యాచ్‌లో చూడవచ్చని వెల్లడించింది.

అహ్మదాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభమైనప్పుడు, ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీలు ఉండవచ్చని అంచనా వేసింది. రాత్రి ఉష్ణోగ్రత తగ్గుతుందని…కనిష్టంగా 18 నుంచి 20 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మనోరమా మొహంతి మాట్లాడుతూ.. దీపావళి తర్వాత రాష్ట్రంలో చలి పెరిగిందన్నారు. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపారు. మ్యాచ్ చూసే సమయంలో క్రికెట్ ప్రేమికులు వేడిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య శీతల గాలుల కారణంగా చలి నిరంతరం పెరుగుతుందని వెల్లడించింది.

వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దైతే రిజర్వ్ డేలో మ్యాచ్ ఆడతారు. రిజర్వ్ రోజు కూడా వర్షం పడితే, ఈ పరిస్థితిని కూడా ICC రూపొందించింది. ఈ నిబంధన ప్రకారం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ప్రస్తుతం, వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, దాని అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఈ ఆటగాడితో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలి..లేదంటే..!!

Latest News

More Articles