Friday, May 10, 2024

ఎడ్ల బండి నడిపిన జడేజా.. వైరల్ వీడియో

spot_img

టీం ఇండియా ఆల్‌ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మైదానంలోకి దిగాడంటే బ్యాటుతో, బంతితో ప్ర‌త్య‌ర్థులను బెంబేలెత్తిస్తాడు. అంతేకాదు హాఫ్ సెంచ‌రీ కొట్టిన‌ ప్ర‌తిసారి క‌త్తిసాము చేస్తూ ఫ్యాన్స్‌ను అల‌రిస్తుంటాడు. తాజాగా జడ్డూ ఎండ్ల‌ బండి న‌డిపి, ఆ వీడియోను తన ఇన్‎స్టాలో పోస్ట్ చేశాడు. భారీ కొమ్ములున్న‌ రెండు ఎద్దుల‌ను అదిలిస్తూ బండిని ప‌రుగులు పెట్టించాడు. ఆ వీడియోకు ‘వింటేజ్ రైడ్’ అనే క్యాప్ష‌న్ పెట్టాడు. ఈ వీడియో చూసిన అభిమానులు, మాజీ క్రికెట‌ర్లు జడేజాను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

2023లో ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన జ‌డేజా ఐసీసీ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్’ అవార్డుకు నామినేట్ అయిన విష‌యం తెలిసిందే. టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్, ప్యాట్ క‌మిన్స్ కూడా ఈ అవార్డు రేసులో ఉండటం గమనార్హం.

Read Also: ట్రాన్స్ జెండర్‎గా మారిన భర్తను సుపారీ ఇచ్చి చంపించిన భార్య

Latest News

More Articles