Monday, May 6, 2024

గులాబీ బాస్ సంచనలం..ఇంటర్వ్యూకు రికార్డు వ్యూస్..!

spot_img

కేసీఆర్ ..ఈ పదంలో ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉంటాయి. ఓ విధంగా చెప్పాలంటే ఆ పేరే ఓ సంచలనం. ఆయన మాటలు వింటుంటే..ఇంటి పెద్ద మాట్లాడినంత ధైర్యంగా ఉంటుంది. కేసీఆర్ ను పిల్లలు తాతలు, పెద్దలు పెదనాన్న, సోదరుడిలా, కొడుకులా భావిస్తుంటారు. ఆయన ప్రసంగం ఉందంటే ఎప్పుడెప్పుడు మాట్లాడుతారా అంటూ ఎదురుచూస్తుంటారు. కేసీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాటలు చెరపలేని శాసనం. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ రికార్డుల మోత మోగిస్తోంది. మంగళవారం టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ తన రికార్డును తానే బద్దలు కొట్టారు. 2012లో నాన్ స్టాప్ గా టీవీ9 రజనీకాంత్ కే 3.30 గంటలపాటు ఇంటర్వ్యూ ఇచ్చారు కేసీఆర్. పుష్కర కాలం తర్వాత ఇప్పుడు ఏకధాటిగా 4గంటలపాటు అదే టీవీ9లో రజనీకాంత్ కు మరోసారి సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు. 4గంటలపాటు సాగిన ఈ ఇంటర్వ్యూకు సుమారు 95వేలకు పైగా నాన్ స్టాప్ వ్యూస్ రావడం తెలుగుమీడియా రంగంలో ఇదొక సంచలనం అంటున్నారు నిపుణులు. ఈవెంట్స్ మినహా వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ఈ స్థాయిలో భారీ లైవ్ వ్యూస్ రావడం రికార్డుగా చెబుతున్నారు.

గ్రామాల నుంచి పట్టణాలు, మెట్రో సిటీల వరకు లక్షలాది మంది జనం టీవీల ముందు అతుక్కుపోయారు. ఐపీఎల్ మ్యాచ్ ను బంద్ పెట్టి కేసీఆర్ డిబేట్ నే విన్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు తమ నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ డిబేట్ ఇంట్రెస్టింగ్ గా విన్నారు. ఇంటర్వ్యూలో కేసీఆర్ చెబుతున్నఒక్కొక్క డైలాగ్ కు ఆయన అభిమానులు సంతోషంతో కేరింతలు కొట్టారు. మనదేశంలో ఏ నాయకుడిని లేనంత క్రేజ్ ను కేసీఆర్ సొంతం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టు ఆగ్రహం..మరోసారి పతంజలి క్షమాపణలు.!

Latest News

More Articles