Tuesday, May 7, 2024

World Cup 2023 కెప్టెన్‌గా ప్రకటించగానే రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌

spot_img

World Cup 2023 : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ 2023 కోసం టీమిండియా జ‌ట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్, రోహిత్ శర్మ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన పేరును అగార్కర్‌ చదవగానే రోహిత్‌ ఒక్కసారిగా చేయి పైకెత్తి హే.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇది కూడా చదవండి.. యూట్యూబ్ ‘లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ స్కామ్‌: రూ. 3.3 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి..!!

ఇక టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టనున్నారు.  టాప్ ఆర్డర్‌లో శుభ‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజా ఉండగా.. బౌల‌ర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌, ష‌మీ, అక్షర్ ప‌టేల్ ఎంపికయ్యారు. ఇషాన్ కిష‌న్‌, సూర్యకుమార్ యాద‌వ్‌ల‌కు కూడా టీమ్ 15లో చోటు క‌ల్పించారు.

Latest News

More Articles