Sunday, May 5, 2024

చంద్రునిపై కూలిన రష్యా లునా-25

spot_img

రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి మూన్‌ మిషన్‌ లునా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయింది. ల్యాండింగ్‌కు ముందు విన్యాసాల సమయంలో చంద్రునిపై అంతరిక్ష నౌక కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ నిన్న(ఆదివారం) తెలిపింది. శనివారం మధ్యాహ్నం 2.57 గంటలకు లునా-25 కమ్యూనికేషన్‌ కోల్పోయిందని రోస్‌కాస్మోస్‌ చెప్పింది. ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. ల్యాండర్‌ చంద్రుని ఉపరితలాన్ని ఢీకొన్న తర్వాత ఉనికిలో లేదని తెలిపింది. అంతరిక్ష నౌకను గుర్తించి, కమ్యూనికేట్‌ చేసేందుకు ఈ నెల 19, 20 తేదీల్లో తీసుకున్న చర్యలు విఫలమయ్యాయని వివరించింది. రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ఈ నెల 11న ‘లునా-25’ని ప్రయోగించింది. 10 రోజుల పాటు ప్రయాణించిన ల్యాండర్‌ కొన్ని గంటల క్రితమే చంద్రుడి ఫొటోలను పంపించింది. ఈ నెల 21న చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ కావాల్సి ఉంది. అందుకోసం కక్ష్య కు చేరడానికి కీలక విన్యాసం చేపట్టే ప్రయత్నంలో లునా-25 లోని ఆటోమేటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు రోస్‌కాస్మోస్‌ గుర్తించింది. అప్పటికే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు తెలిపింది.

Latest News

More Articles