Sunday, May 5, 2024

గవర్నర్ గారు తన కళ్లకున్న బీజేపీ తెరలను తొలగించుకుంటే అభివృద్ధి కనబడుతుంది

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దిలోకి అడుగుతున్న శుభ సందర్భంలో రాష్ట్రం గురించి గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ, వై.సతీష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర గవర్నర్ గా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సింది పోయి అభివృద్ధి జరగడం లేదంటూ ఓ  అపోజిషన్ పార్టీ లీడర్  లాగా గవర్నర్ గారు మాట్లాడటం చింతించాల్సిన విషయమన్నారు.

‘‘గవర్నర్ గారి మాటల్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఎందుకంటే తెలంగాణ పల్లెలు అద్భుతంగా ఉన్నాయంటూ స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డులు ఇచ్చింది. BJP పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణకి ఎక్కువ అవార్డులు ఇచ్చింది. కేంద్రం 46 అవార్డులు ఇస్తే అందులో 13 తెలంగాణ గ్రామాలకే వచ్చాయి. తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ గారి విజన్ తో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు అద్భుతం అంటూ ఇటీవలే నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది.

తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి

100% ఓడిఎఫ్ గ్రామాలు కూడా తెలంగాణలో ఉన్నాయని అదే కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. తెలంగాణ పల్లెలు ఏమాత్రం అభివృద్ధి చెందకుండానే ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో  20 అవార్డుల్లో తెలంగాణకు 19 అవార్డులు ఇచ్చిందా. .? దీనిపై గవర్నర్ గారు కాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను పక్కనపెట్టి ప్రతి పనిలో సర్కారుకు అడ్డు తగులుతూ అభివృద్ధిని అడ్డుకుంటూ ఇప్పుడు అభివృద్ధి జరగడం లేదంటూ మాట్లాడటం సిగ్గుచేటు. ఎవరు సహకరించినా సహకరించకున్నా తెలంగాణలో పట్నం నుంచి పల్లెల దాకా ప్రతి చోట అభివృద్ధి జరుగుతోందనేది జగమెరిగిన సత్యం.

గత పాలకులు తమ స్వార్ధ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం అభివృద్ధిని హైదరాబాద్ కి పరిమితం చేసి పల్లెలను విస్మరించారు. కానీ కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి వికేంద్రీకరణ మొదలైంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు లేని గ్రామంలో లేదు. స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందని ఇల్లు లేదు.

కానీ ఇవేవీ తెలియనట్టు గవర్నర్ కి తక్కువ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలికి ఎక్కువ అన్నట్టుగా గవర్నర్ గారు మాట్లాడటం సబబు కాదు. రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న శుభతరుణంలో ఇలాంటి మాటలు మాట్లాడటం అమరుల స్ఫూర్తిని అవమానించడమే అవుతుంది. గవర్నర్ గారు తన కళ్లకున్న బిజెపి తెరలను తొలగించుకుంటే పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి ఏంటో కనిపిస్తుంది.’’ అని అన్నారు.

Latest News

More Articles