Tuesday, May 7, 2024

తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ..

spot_img

నూటికి నూరుశాతం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ‘ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‎కు ఎగ్జాక్ట్ పోల్స్‎కు చాలా తేడా ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ నమ్మదగినవి కాదు. పోలింగ్ ముగిసిన గంటకే ఫలితాలు ఎలా వస్తాయి? వాస్తవ అంచనాలు వేరు. ఏ అంచనా ప్రకారం ఫలితాలు ఇస్తారు. కొన్ని పార్టీలకు చెందిన సర్వే సంస్థలు వాళ్ళకు అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నాయి. ఎగ్జాక్ట్ ఫలితాలు రేపు బయటపడుతాయి. నూరుశాతం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. నవంబర్ 30న జరిగిన ఎన్నికలలో మూడవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఖచ్చితంగా చెప్పగలను.

Read Also: లండన్‎లో వాకింగ్‎కు వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి

తెలంగాణ ప్రజలకు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో పూర్తిగా తెలుసు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనను చూశారు. ఏదో మొక్కుబడిగా ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తూ హడావుడి చేసే వారిని ఎవ్వరూ నమ్మరు. బీఆర్ఎస్ పార్టీకి స్థిరమైన, బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉన్నది. కేసీఆర్ చెప్పిన మాట మీద నిలబడుతాడు అనే నమ్మకం ప్రజలకు ఉన్నది. కరోనా సమయంలో అన్ని రాష్ట్రాల పరిపాలన, ఆర్ధిక వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదు. అందుకు కారణం కేసీఆర్ సమర్ధవంతమైన పరిపాలన. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ అన్ని వచ్చాయి.. ఏదీ ఆపలేదు. తెలంగాణ అంటే కేసీఆర్-కేసీఆర్ అంటే తెలంగాణ అనే నమ్మకం ప్రజలలో ఉన్నది. మేమందరం అఖండ విజయం సాదిస్తాం’ అని పోచారం ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

More Articles