Monday, May 6, 2024

నేటి నుంచి బడులకు వేసవి సెలవులు..!

spot_img

తెలంగాణలో బడులకు వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను ప్రకటించింది విద్యాశాఖ.తిరిగి జూన్ 12న స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని విద్యాశాఖ ఆదేశించింది. సెలవుల్లో తదుపరి తరగతులకు బోధన నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

రాష్ట్రంలో ఎండలు భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో సెలవుల్ల ఎండల్లో తిరగకుండా తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక ద్రుష్టిపెట్టాలని అధికారులు సూచించారు. అలాగే తల్లిదండ్రులకు చెప్పకుండా చెరువులు, బావులు, కాలువల్లో ఈతకు వెళ్లకూడదని విద్యార్థులను కోరారు. ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Latest News

More Articles