Thursday, May 2, 2024

లంక బౌల‌ర్ల‌ ఊచ‌కోత.. 45 బంతుల్లోనే శ‌త‌కం బాదిన సూర్య‌కుమార్

spot_img

సిరీస్ నిర్ణయించే మూడో టీ20లో టీమిండియా అద‌రగొట్టింది. వైస్ కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ సెంచ‌రీతో చెల‌రేగడంతో 20 ఓవ‌ర్ల‌లో 228 ప‌రుగులు భారీ స్కోర్ చేసింది.

లంక బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన‌ సూర్య‌ 45 బంతుల్లోనే టీ20లో తన మూడో సెంచ‌రీ సాధించాడు. టీమిండియా త‌ర‌ఫున వేగ‌వంత‌మైన టీ20 సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు.మొద‌టి స్థానంలో రోహిత్ శ‌ర్మ.. 2017 శ్రీ‌లంకపై రోహిత్ 35 బంతుల్లోనే శ‌త‌కం బాదాడు.

ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ 48 ప‌రుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 35 ర‌న్స్‌తో రాణించారు. దీప‌క్ హుడా (4), హార్ధిక్ పాండ్యా (4)ఇషాన్ కిష‌న్ (1) విఫ‌లం అయ్యారు. చివ‌ర్లో అక్ష‌ర్ ప‌టేల్(21) 9 బంతుల్లో 4 ఫోర్లు బాది విధ్యంసం సృష్టించాడు.

లంక బౌలర్లలో ర‌జిత‌, క‌రుణ‌ర‌త్నే, హ‌స‌రంగ త‌లా ఒక వికెట్ తీశారు. టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొద‌టి టీ20లో టీమిండియా 2 ప‌రుగుల‌తో గెలువగా.. రెండో టీ20లో శ్రీ‌లంక 16 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన విషయం తెలిసిందే.

Latest News

More Articles