Wednesday, May 8, 2024

బ్రేకింగ్.. తమిళ హీరో విజయ్ విడాకులు ?

spot_img

సూపర్ స్టార్ విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇవ్వనున్నాడన్న వార్త తమిళ మీడియాలో సంచలనం రేపుతోంది. అసలు విజయ్ భార్య సరిగ్గా ఇప్పటివరకు మీడియాతో మాట్లాడింది లేదు. ఈవెంట్స్ లో అప్పుడప్పుడు మాత్రమే భర్తతో బయటికొస్తుంది. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే ఒక కంప్లీట్ హౌస్ వైఫ్ గ విజయ్ భార్య సంగీతకి పేరుంది. అలాంటి ఈ జంటపై డివోర్స్ రూమర్స్ రావటం కలకలం రేపుతోంది. కేవలం పబ్లిసిటీ స్టెంట్ అని మాత్రం అనుకోలేం. ఎందుకంటే విజయ్ లాంటి సూపర్ స్టార్ కి ఇలాంటి చీప్ పబ్లిసిటీ అవసరం లేదు. ఇక నిప్పు లేనిదే పొగ రాదని ఇప్పటికే చాలామంది మ్యాటర్స్ ని నిరూపించింది సోషల్ మీడియా. మరి ఈ విడాకుల వార్త ఎంతవరకు నమ్మొచ్చో లేదో అని విజయ్ ఫ్యాన్స్ తెగ కలవరపడుతున్నారు.

గత నెలలో దర్శకుడు అట్లీ ఇంట్లో ఫంక్షన్ కి విజయ్ ఒంటరిగా వెళ్లాడు. అలాగే వారిసు యొక్క ఈవెంట్ లో కూడా సంగీత కనిపించలేదు. పైగా గత కొన్ని వారాలుగా విజయ్ మరియు సంగీత కలిసి ఏ ఒక్క కార్యక్రమంలో జంటగా కనిపించలేదు. దాంతో విడాకుల విషయం నిజమే అయ్యి ఉంటుందని అభిమానులు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. ఈ విషయంపై జాతీయ మీడియా ఒక క్లారిటీ ఇచ్చింది. విజయ్ కి సన్నిహిత వర్గాలతో మాట్లాడితే.. ఇవి నిరాధారమైన పుకార్లు అని కొట్టిపారేస్తున్నారు. విజయ్ భార్య సంగీత ప్రస్తుతం వారి పిల్లలతో పాటు USA లో సెలవులు తీసుకుంటోందని.. ఆమె ఈ ఈవెంట్‌లకు రాకపోవడానికి కారణం అదే అంటూ పీర్ టీమ్ నుండి లీక్ అయితే ఒకటి వచ్చేసింది. ఇక వ‌రిసు రిలీజ్ త‌ర్వాత విజ‌య్ కూడా త‌న కుటుంబాన్ని క‌ల‌సేందుకు విదేశాల‌కు ప‌ర్య‌టిస్తున్నారని.. అక్కడే తమ 23 సంవత్సరాల వివాహ దినోత్సవాన్ని చేసుకోనున్నారని.. అప్పుడే విజయ్ ఈ రూమర్స్ కి సమాధానం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

 

Latest News

More Articles