Thursday, May 9, 2024

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమ్‌ఇండియా మొదటి స్థానం

spot_img

టీమ్‌ఇండియా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 4-1 తేడాతో చిత్తు చేసింది. హైదరాబాద్‌ టెస్టులో మినహా.. వైజాగ్‌, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచుల్లో భారత్‌ విజయాలను నమోదు చేసింది. దీంతో తాజాగా ఐసీసీ ర్యాంకుల్లోనే భారత్ దూసుకొచ్చింది. టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా మొదటి అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్ 122 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను అందుకోగా.. ఆస్ట్రేలియా (117) రెండో స్థానంలో ఉంది. భారత్‌ చేతిలో సిరీస్‌ను కోల్పోయినప్పటికీ ఇంగ్లాండ్‌ (111) మాత్రం మూడో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ (101), దక్షిణాఫ్రికా (99) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇప్పటికే వన్డేలు, టీ20ల్లోనూ భారత్‌దే టాప్‌ ర్యాంక్. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ టీమ్‌ఇండియా (68.56 శాతం) మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ (60), ఆసీస్ (59.09) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు టెస్టు ర్యాంక్‌తో కలిపి నాలుగింట్లోనూ టీమ్‌ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. వన్డేల్లో భారత్ (121), ఆస్ట్రేలియా (118), దక్షిణాఫ్రికా (110), పాకిస్థాన్ (109), న్యూజిలాండ్‌ (102) టాప్‌ -5లో ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌ విషయానికొస్తే.. భారత్ (266), ఇంగ్లాండ్ (256), ఆస్ట్రేలియా (255), న్యూజిలాండ్ (254), పాకిస్థాన్ (249) మొదటి ఐదు ర్యాంకులను దక్కించుకున్నాయి.

ఇది కూడా చదవండి:బీఆర్‌ఎస్‌తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్

Latest News

More Articles