Wednesday, May 1, 2024

భారత్.. జింబాబ్వే పర్యటన షెడ్యూల్ ఖరారు

spot_img

భారత్ జింబాబ్వే షెడ్యూల్ ఖారారైంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జింబాబ్వేలో అడుగుపెట్టనుంది భారత్. ఈ పర్యటనలో భాగంగా భారత్ మొత్తం 5 టీ20 సిరీస్ మ్యాచ్‌లు ఆడనుంది. భారత జట్టు జూలైలో 5 సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుందని జింబాబ్వే క్రికెట్ ఇవాళ(మంగళవారం) ప్రకటించింది. జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. మొత్తం మ్యాచ్‌‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6, 7,10, 14 తేదీల్లో జరుగుతాయి.

ఎనమిదేండ్ల తర్వాత జింబాబ్వేలో భారత్ పర్యటించడం ఇదే మొదటి సారి. చివరి సారిగా 2016లో సిరీస్ ఆడగా భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు మూడు సార్లు జింబాబ్వే టూర్‌కు వెళ్లిన టీంమిడియా. రెండు సిరీస్ లు గెలిచింది. కాగా, మరో మ్యాచ్ 2015లో సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది. ఇక్కడ మొత్తం 7 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో రెండు టీ20ల్లో ఓటమిపాలైంది.

ఇది కూడా చదవండి: భారత హాకీ ప్లేయర్‌పై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు

Latest News

More Articles